Subtotal $0.00
View cartCheckout
At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.
Sign up to get update news about us. Don't be hasitate your email is safe.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలిచ్చిన మెమోలే కోటి సంతకాలని, ప్రజల నిర్ణయాలను గౌరవించకుండా ముందుకెళితే ప్రభుత్వ పతనం ఖాయమని వైసీపీ నాయకురాలు, మాజీమంత్రి విడదల రజని అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో రజినీ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా మూర్ఖంగా వ్యవహరిస్తే ఆ నిర్ణయమే ఈ ప్రభుత్వానికి మరణశాసనంగా మారుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైయస్సార్సీపీ నిర్వహించిన ఉద్యమానికి అన్నివర్గాలు విశేష స్పందన వచ్చిందని, యువత, ఉద్యోగులు వివిధ రంగాల నిపుణులు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారని విడదల రజని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూదికి, దూదికి కూడా కరువొచ్చిందని, అంబులెన్సులు మూతబడ్డాయని, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని మండిపడ్డారు. చివరికి ఆరోగ్య శాఖామంత్రి కూడా ఈవిషయాన్ని అంగీకరించారని వెల్లడించారు.వైయస్సార్సీపీ హయాంలో వైద్యారోగ్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, ఇప్పుడు కూటమి పాలనలో నిర్వీర్యం అవుతున్న తీరుని ప్రజలు గ్రహించారు కాబట్టే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి స్వచ్చందంగా ముందుకొచ్చి మద్ధతు పలుకుతున్నారని వివరించారు. వైయస్సార్సీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను డిజిటలైజ్ చేసి ఆ రికార్డులను డిసెంబర్ 18న మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారి నేతృత్వంలో గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు..
కూటమి ప్రభుత్వంలో సూదికి, దూదికి కూడా కరువొచ్చింది..!

Related Tags: