దేశ ఆర్ధికరాజధాని ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అరెస్ట్ చేసాయి. పంజాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ఈ అరెస్టులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు. అరెస్ట్ అయిన ఉగ్రవాదులను షాజన్, మనీష్ బేడీగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో వీరు పాకిస్తాన్ ISI ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్టు కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు వీరు పథకాలు రచించినట్టు తెలుస్తోంది. అలాగే, ఉగ్రవాదులు అర్మేనియా నుంచి తమ కార్యకలాపాలను ఆపరేట్ చేస్తున్నట్టు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి ఆదేశాలు తీసుకుంటూ భారత్‌లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. ఈఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భద్రతా అధికారులు పేర్కొన్నారు. దేశ భద్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.















Comments are closed