ప్రజలు మెచ్చే పాలన అందించేలా ప్రతి అధికారి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. వృద్ధిరేటు పెంపునకు తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చించారు. 2025-26 సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్ధిక ఫలితాలపై సమీక్షించారు. మూడు, నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ జీఎస్డీపీ, డేటా డ్రివెన్ గవర్నెన్సు అంశాలపై సూచనలు చేశారు. అలాగే సూపర్ సిక్స్ పథకాల అమలు, పౌరసేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఫైళ్ల క్లియరెన్సు, ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటా లేక్, ఐటీ అప్లికేషన్లపై అధికారులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారంపై హెచ్ఓడీలకు సూచనలు చేశారు.
కేంద్ర పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ఫలితాలపై చర్చించారు. ఈ సమీక్ష సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది.. ప్రజలు మెచ్చే పాలన అందించాలి.. ఫైళ్లు పెండింగులో లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారంతో డేటా లేక్ వ్యవస్థ సిద్ధం అయ్యింది. ఈ సమాచారంతో ఇకపై డేటా డ్రివెన్ గవర్నెన్స్ దిశగా అందరూ పని చేయాలి. నాలెడ్జ్ ఎకానమీ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. పెద్ ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. విశాఖలో 1గిగా వాట్ సామర్ధ్యంతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ప్రధానిని మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కలిసి రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్దమని చెప్పారు. ప్రజల అవసరాల కోసం రాజ్యాంగాన్నే సవరణలు చేశారు. ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే పరిస్థితి ఉండకూడదు. ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు చేరే పరిస్థితి రావాలని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలూ, విభాగాలు ఆడిట్ పరిధిలోకి రావాల్సిందే. ప్రధాని నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి సుపరిపాలన, అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణ హామీ ఇచ్చాం. ఆ దిశగా పాలన సాగేలా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ పని చేయాలి” అని సీఎం స్పష్టం చేశారు.












Comments are closed