ప్రపంచ ప్రఖ్యాత పుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి డిశంబర్ 13వ తేదీన హైదరాబాద్ నగరంలో అడుగుపెడతారు. ‘ది గోట్ ఇండియా టూర్-2025’లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ‘గోట్ కప్’నకు అటెండ్ అవుతారు. ఈ అర్జెంటీనా లెజెండ్ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు, ఇటు సినీ, రాజకీయ, క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మెస్సీతో ఫొటో దిగాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. అయితే మెస్సీ హైదరాబాద్ లోనే ఉంటారు కదా.. వెళ్లి ఫొటో దిగేద్దాం అంటే పొరపాటే.. ఎందుకంటే ఆయనతో ప్రత్యేకంగా ఫొటోలు తీసుకోవాలంటే భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. మెస్సీతో ఒక్క ఫొటోకు రూ.10లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ‘ద గోట్ టూర్’ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతి రెడ్డి ఇప్పటికే తెలిపారు. అదికూడా కేవలం కేవలం 100మందికి మాత్రమే ఉంటుందని ఆమె చెప్పారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే ‘మెస్సీతో మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయనతో డబ్బు చెల్లించినవారు ఆయనను కలిసి ఫొటోలు దిగొచ్చు. ఇప్పటికే ఫొటో దిగేందుకు డిస్ట్రిక్ట్ యాప్‌లో ఆ టికెట్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు వెల్లడించారుమెస్సీతో ఫొటో దిగాలంటే రూ.10లక్షలు.. అదికూడా 100మందే..














Comments are closed