కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18నెలలు గడుస్తున్నా.. పూర్తిస్థాయిలో ఏడాది పాలించిన యేడాది మాత్రం 2025లోనే.. ఈ ఏడాదిలో రాష్ట్రప్రభుత్వం అనేక మైలురాళ్లను అధిగమించింది. సంక్షేమ, అభివృద్ధి పధకాలకు రూపకల్పన చేసింది. ముఖ్యంగా మహిళలకు లబ్ధి చేకూరేలా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
- సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్
- తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం
- స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం… ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.1,144 కోట్ల వ్యయం.
- దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. వీరు ఎక్కడైనా పింఛను తీసుకునే అవకాశం
- అన్నదాత సుఖీభవ : 46 లక్షల మంది రైతులకు… రూ.6,310 కోట్లు రైతుల ఖాతాలో జమ
- దీపం–2 : ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, రూ.2,684 కోట్లు, ఇప్పటికి దాదాపు 2 కోట్ల సిలిండర్ల పంపిణీ
- ఎన్టీఆర్ భరోసా : ఇప్పటివరకు రూ.50,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం… ఏడాదిలో రూ.33,000 కోట్లు పంపిణీ, నెలకు రూ.2,750 కోట్లు
- మత్స్యకార భరోసా : ఏడాదికి 20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు
- నేతన్నలకు ఉచిత విద్యుత్ : మర మగ్గాలకు నెలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
- ఆటో డ్రైవర్ల సేవలో : ఏడాదికి రూ.15,000… రూ.436 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ది
- అన్నా క్యాంటిన్ : 204 అన్నా క్యాంటిన్లు. ఇప్పటి వ రకు 4 కోట్ల భోజనాలు
- గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు
- వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ – స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
- ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూ. 3,670 కోట్లు వ్యయం.
- 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం రూ.51 కోట్లు
- ఇమామ్‌లకు నెలకు రూ.10,000 మౌజన్లకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు
- పురోహితులకు నెలకు రూ.15,000కు వేతనాల పెంపు -నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000కు వేతనాల పెంపు
- జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం – మహిళలకు లక్ష కుట్టు మిషన్ల పంపిణీ
- మెగా డీఎస్సీ… ముఖ్యమంత్రి తొలి సంతకం. 15,941 టీచర్ పోస్టుల భర్తీ
- 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి, రూ.4,500 నుంచి రూ.12,500కు స్టైఫండ్ పెంపు
- అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు – బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు
- దాదాపు 84 లక్షల టన్నుల చెత్త తొలగింపు. ప్రతీ నెల ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’. డోర్ టు డోర్ కలెక్షన్
- రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు. మరో రూ.3,000 కోట్లతో రహదారుల నిర్మాణం
- కొత్తగా 23 పాలసీలు, పరిశ్రమలకు రాయితీలకు దేశంలో తొలి సారి ఎస్క్రో ఖాతాలు
- సీఐఐ సమ్మిట్ 610 ఒప్పందాలు. రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.13 లక్షల ఉద్యోగాలు
- 13 ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.8.55 పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలు
- 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్
- విశాఖ ఐటీ హబ్, గూగుల్ – రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్‌కు శంకుస్థాపన
- క్వాంటం వ్యాలీకి తొలి అడుగు, అమరావతి పనులు వేగవంతం
- తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెనుమార్పులు, 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు
- విశాఖలో యోగాంధ్ర నిర్వహణ.., కర్నూలులో సూపర్ జీఎస్టీ సభ సక్సెస్
- పీపీపీ విధానంలో పేద విద్యార్ధులకు అదనంగా 110 వైద్య విద్య సీట్లు
- గాడిలో పంచాయతీరాజ్ వ్యవస్థ. పల్లెపండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణం
- రాష్ట్రమంతటా ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణ, దాదాపు 3 వేల పనులకు శ్రీకారం
- అడవితల్లి బాటతో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4జీ నెట్వర్క్
- పంచాయతీ రాజ్ వ్యవస్థలో పదోన్నతులు, 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల, 95 సీఎస్ఎస్ పథకాల పునరుద్ధరణ
- రాష్ట్రానికి కుంకీ ఏనుగులు. ప్రతీ ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు. రూ.3,050 కోట్లతో ప్రాజెక్ట్‌కు రూపకల్పన, 1.21 కోట్ల మంది దాహార్తిని తీర్చాలని లక్ష్యం.
- 100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ – చెరువులు, ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగునీరు
- సమర్థ నీటి నిర్వహణతో 6.08 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు
- పోలవరం పనుల్లో పురోగతి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులు- వేగంగా వెలిగొండ పనులు
- రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో జమ. ఈ ఖరీఫ్ సీజన్లో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ, 5.48 లక్షల మంది రైతులకు రూ.8,120 కోట్లు జమ
- మార్కెట్ ఇంటర్వెన్షన్ – పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పంటలకు రూ.1,100 కోట్లకు పైగా సాయం
- రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28 శాతం…. పెరిగిన మూలధన వ్యయం
- రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, నాలా చట్టం రద్దు
- ఇళ్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా స్థలం, దరఖాస్తుల స్వీకరణ పూర్తి
- గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో… డిజి హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ
- విద్యా వ్యవస్థలో పెనుమార్పులు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా బదిలీలు
- 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 75 లక్షల విద్యార్ధులకు హెల్త్ చెకప్, విద్యార్ధుల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచేలా ‘ముస్తాబు’ కార్యక్రమం
- గాడిన పడిన విద్యుత్ రంగం – ట్రూ డౌన్ కు అంకురార్పణ. విద్యుత్ కొనుగోళ్ల ధరలు తగ్గించేలా కార్యాచరణ… ప్రస్తుతం ఉన్న యూనిట్ ధర రూ.5.19 నుంచి రూ.4.80కు తగ్గేలా చర్యలు
- క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల స్థాపనకు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు.
- 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ – బీసీలకు రూ.20 వేల అదనపు సాయం
- తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి-డ్రగ్స్ అరికట్టాం, ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
- స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, వాట్సప్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, విపత్తుల నిర్వహణ, పీ4
- విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధి
- పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి దక్కిన చోటు- విశాఖ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం పనులు
- కేంద్రంతో సమన్వయం, దాదాపు 90 కేంద్ర పథకాల పునరుద్దరణ, మోదీ గారి సహకారం
- రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు – స్టీల్ ప్లాంట్ కు రూ. 11440 కోట్లతో కేంద్ర ఊతం
- లక్ష కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు.
- కొత్తగా మరో రెండు జిల్లాల ఏర్పాటుకు ప్రజామోదం, 26 నుంచి 28కి పెరగనున్న జిల్లాల సంఖ్య.















Comments are closed