Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Business
  • రేవంత్ విజన్ కు నాగార్జున ఫిదా.. ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియోస్

రేవంత్ విజన్ కు నాగార్జున ఫిదా.. ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియోస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసపుత్రిక ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ విజయవంతంమైంది.. ఈ కార్యక్రమంలో హీరో నాగార్జున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట ఫ్యూచర్ సిటీకి వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో కలిసి ఫ్యూచర్ సిటీ ప్లానింగ్ ను, పలు స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామని అఫీషియల్ గా ప్రకటించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందిని, రాష్ట్ర ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ ను తాను కూలంకశంగా చదివాననని, ఎంతో అద్భుతంగా ఉందని నాగార్జున ప్రశంసించారు. ఫ్యూచర్ సిటీలో ఫిలిం హబ్ ఏర్పాటు చేయాలనే చర్చలు జరుగుతున్నాయని అందులోభాగంగా తమ అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామన్నారు.

నాగార్జున చెప్తున్నట్టు ఇప్పటికే ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ ను బంజారాహిల్స్ నుండి ఫ్యూచర్ సిటీకి తరలిస్తారా.. లేదా అక్కడే నూతనంగా అన్నపూర్ణ స్టూడియోను నిర్మిస్తారా అనేది చూడాలి.. ఎందుకంటే గతంలో అన్నపూర్ణ స్టూడియో నిర్మించినప్పుడు అవి చౌకగా ఉన్న భూములు.. కానీఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అత్యంత బిజీ ఏరియాల్లో ఒకటి.. అక్కడ భూములు కోట్లు పలుకుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో హిల్ట్ పాలసీలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచరీ సిటీకి తరలించేలా ఒప్పందం చేసుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

హిల్ట్ పాలసీ ప్రకారం చూస్తే ప్రభుత్వం ఏదైనా ఒక పర్పస్ కోసం కేటాయించిన భూములు అందుకు మాత్రమే వినియోగించాలి.. ఉదాహరణకు ఫ్యాక్టరీ లేదా స్టూడియో వంటి వాటికి కేటాయించిన భూములను వాటికే వినియోగించాలి. ఇతరత్రా కార్యక్రమాలకు అనుమతి లేదు. అలా అన్నపూర్ణ స్టూడియోలో స్టూడియో నిర్వహణకు మాత్రమే వినియోగించాలి.

అలాంటిది ప్రభుత్వం మల్టిపుల్ యూజ్ గా మారిస్తే నగర శివారు ప్రాంతానికి స్టూడియోను తరలించి.. అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ లేదా హోటల్స్ వంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. నాగార్జున మంచి బిజినెస్ మేన్ కాబట్టి.. ప్రభుత్వం పలు రాయితీలు ఇచ్చి అన్నపూర్ణ స్టూడియోలకు అవకాశమిస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని నాగార్జున ఫ్యూచర్ సిటీలో భారీఎత్తున స్టూడియో నిర్మాణం చేపట్టడం ద్వారా మరింత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయనడంలో సందేహం లేదు.

Comments are closed

Related Posts