Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • తండ్రికి తగ్గ తనయుడిగా పెట్టుబడుల వేటలో.. తన మార్క్ చూపిస్తున్న లోకేష్..!

తండ్రికి తగ్గ తనయుడిగా పెట్టుబడుల వేటలో.. తన మార్క్ చూపిస్తున్న లోకేష్..!

nara lokesh us tour

అమెరికాలో మంత్రి నారా లోకేశ్‌ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్ తో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “ఒక కుటుంబంలో ఒక AI ఆధారిత సభ్యుడు” అనే లక్ష్యాన్ని సాధించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం అని, ఇందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం తమతో కలిసి పనిచేయాలని కోరారు. ఏపీలోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులకు ఉచిత చాట్ జీపీటీ అందించాలని భావిస్తున్నామని.. ఏపీలో ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. ఏపీని ఓపెన్ ఏఐ డేటా సెంటర్ కార్యకలాపాలకు ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఏఎండీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంశీ బొప్పనతో లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ రంగ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్స్ & సెమీ కండక్టర్ పాలసీని ప్రకటించామని, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో ఏఎండీ ఉత్పత్తుల అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేసి, సప్లయ్ చెయిన్ లో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఏఎండీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంశీ బొప్పన మాట్లాడుతూ… అతి పెద్ద ఆర్ అండ్ హబ్ భారత్ లోనే నిర్వహిస్తున్నామని,. బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ క్యాంపస్ లలో సిలికాన్ డిజైన్, సాఫ్ట్ వేర్, ఏఐ ఆవిష్కరణలకు ప్రాధాన్యత నిస్తున్నామని తెలిపారు. అధునాతన చిప్ ఉత్పత్తి కోసం టిఎస్ఎంసి, గ్లోబల్ ఫౌండ్రీస్, ప్యాకేజింగ్ భాగస్వామ్యాలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

అనంతరం కాన్వా ఛీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగాధిపతి జాసన్ విల్ మాట్ లతో లోకేష్ భేటీ అయ్యారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూ.65వేల కోట్ల వ్యయంతో అమరావతి రాజధాని పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎంటర్ టైన్ మెంట్ సిటీని కూడా అభివృద్ధి చేయబోతున్నామని, అమరావతి క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులో శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో కలిసి పనిచేయాలని కోరారు. ప్రెజెంటేషన్లు, సోషల్ మీడియా గ్రాఫిక్స్, డాక్యుమెంట్లు, పోస్టర్లు, వీడియోల తయారీకి సరళీకృతమైన, క్లౌడ్-ఆధారిత డిజైన్ ప్లాట్‌ఫామ్ లను కాన్వా అందిస్తుందని అన్నారు. తమ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

అనంతరం సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో లోకేష్ భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో విశాఖ మహానగరం డేటా సిటీగా అవతరిస్తోందని, గూగుల్, సిఫీ వంటి సంస్థలు డేటా సెంటర్లపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. విశాఖలో సేల్స్ ఫోర్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, ఆర్ & డి సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని మాట్లాడుతూ…ప్రపంచవ్యాప్తంగా 70వేలకు పైగా గ్లోబల్ వర్క్ ఫోర్స్, ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా 1.5లక్షలకు పైగా సంస్థలకు కస్టమర్ బేస్ సేవలను అందిస్తున్నాం. బ్యాంకింగ్, రిటైల్, ఐటి, భారత్ లోని ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలు డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కోసం మా సంస్థను ఎంపిక చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

అనంతరం రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్ తో లోకేష్ భేటీ అయ్యారు. అమరావతిలో ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీ త్వరలోనే ఆవిష్కృతం కాబోతోంది. అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనా విభాగాన్ని ఏర్పాటుచేసి భాగస్వామ్యం వహించాలని కోరారు. విఆర్ కంటెంట్ క్రియేషన్, ఏఐ ఆధారిత మీడియా ప్రాసెసింగ్ కోసం క్రియేటర్ ల్యాండ్ కు సహకారం అందించాలన్నారు.

అనంతరం ఎలక్ట్రోలైజర్, ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ కాంట్రాక్ట్ సేవలు, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన ఎలక్ట్రోలైజర్‌లను తయారుచేసే అంతర్జాతీయ సంస్థ ఓమియం ఛీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ చొక్కలింగం కరుప్పయ్యతో నారా లోకేష్ భేటీ అయ్యారు.ఇండస్ట్రియల్ జోన్ లలో ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని, ఏపీలో సౌర/పవన సామర్థ్యంతో నడిచే పైలట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను సహ-అభివృద్ధి చేయడంతోపాటు సరఫరా పరిశ్రమలు, రవాణా, అమ్మోనియా ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మ కూనపునేనితో లోకేష్ భేటీ అయ్యారు. ఏఐ ఓప్స్ శిక్షణ, ఇంటర్న్ షిప్ లు, ఆర్ అండ్ డి సహకారం కోసం ఏపీ టెక్ అకడమియాతో భాగస్వామ్యం వహించండి. స్కేలబుల్ సాస్ మోడల్స్ ద్వారా ఐటి కార్యకలాపాల నిర్వహణతోపాటు ఏపీలో ఎస్ఎంఈలు, స్టార్టప్‌లను ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థకు 500+ సంస్థలు కస్టమర్లుగా ఉన్నాయి. వీటిలో ఫైనాన్స్, హెల్త్‌కేర్, రిటైల్, టెక్నాలజీలో పాటు ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఉన్నాయి. భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్ లో ప్రధాన కేంద్రాల ద్వారా ఏఐ ఓప్స్, క్లౌడ్ నేటివ్ మానిటరింగ్ లో ఆవిష్కరణలను ముందుకు తెస్తున్నామని తెలిపారు.

అంతర్జాతీయస్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా విసి మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్ తో లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. విశాఖనగరం ఐటి, డేటా హబ్ గా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సెమీ కండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి. కంపెనీలకు ఏపీ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమైన సమగ్ర ప్రోత్సాహకాలను అందిస్తోంది. పరిశ్రమలకు నిర్ణీత సమయంలో నేరుగా ప్రోత్సాహకాలను అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో ఎకౌంట్ విధానాన్ని ప్రారంభించనునట్లు చెప్పారు సెమీకండక్టర్లు, AI/ML, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి డీప్ టెక్ రంగాలు, సాస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లాంటి ఎంటర్ ప్రైజింగ్ సాఫ్ట్ వేర్, గ్లోబల్ మార్కెట్ లను అనుసంధానించే స్టార్టప్ లలో పెట్టుబడులకు ప్రస్తుతం తాము ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు.

Comments are closed

Related Posts