Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • రామ్ చరణ్ ను కలిసేందుకు జపాన్ నుండి వచ్చిన ఫ్యాన్స్.. ఏం గిఫ్ట్ తెచ్చారో తెలుసా.?

రామ్ చరణ్ ను కలిసేందుకు జపాన్ నుండి వచ్చిన ఫ్యాన్స్.. ఏం గిఫ్ట్ తెచ్చారో తెలుసా.?

ram charan japan fans

చిరంజీవి తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు జపాన్‌ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. చరణ్ పై ఉన్న అభిమానంతో ఎంతోమంది ఆయనను రెగ్యులర్ గా కలుస్తారు.. అయితే కొందరు జపనీస్ ఫ్యాన్స్ చరణ్ కోసం ఏకంగా ఇండియాకే వచ్చేసారు. ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రామ్ చరణ్, ఈ విషయం తెలుసుకుని వారిని ప్రత్యేకంగా కలిసారు.

తనను చూసేందుకు దేశాలు దాటి వచ్చిన మహిళా అభిమానులను రామ్ చరణ్ ఎంతో ప్రేమగా పలకరించి వారితో సరదాగా మాట్లాడారు. జపాన్ అభిమానుల పట్ల చరణ్ చూపిన ప్రేమ, గౌరవం, సింప్లిసిటీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా విజయవంతం కావాలని జపాన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ చరణ్ కు ఫ్యాన్ బేస్ ఉండడంపై చరణ్ అభిమానులు సైతం సంతోషపడుతున్నారు. చరణ్ కోసం జపాన్ నుంచి వచ్చిన అభిమానులు ఆయన స్టిల్స్ ను గ్రీటింగ్ కార్డ్స్ గా కట్ చేస్తూ చరణ్ కు చూపించారు. చరణ్ వాళ్ళ ప్రేమకు ఆశ్చర్యపోయారు. క్రికెట్ బ్యాట్స్ పైన సిగ్నేచర్ చేసి వాళ్ళకు అందించారు.

Comments are closed

Related Posts