Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • మరో కీలకనేత అరెస్ట్ కు రంగం సిద్ధం..! ఆందోళనలో వైసీపీ…

మరో కీలకనేత అరెస్ట్ కు రంగం సిద్ధం..! ఆందోళనలో వైసీపీ…

ycp leader arest

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. నెల్లూరుజిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో కాకణిపై మరో కేసు నమోదు చేశారు. మాజీమంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని, పరుష పదజాలం వినియోగించారని చవటపాలెం సొసైటీ చైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఫిర్యాదు మేరకు కాకణిపై కేసు నమోదు చేసిన వెంకటాచలం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అంతకముందు అక్రమ మైనింగ్ కేసులో కాకాణి అరెస్టయ్యారు. అక్రమ మద్యం కేసులుసైతం కాకాణిపై ఉన్నాయి..

మరోవైపు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి నకిలీమద్యం కేసుల్లో కీలక ఫైళ్లు మాయం అయినట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల సమయంలో లో గోవా నుంచి నకిలీ మద్యానికి లేబుళ్లు వేసి ఏపీకి తెచ్చి, ఓటర్లకు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆనకిలీ మద్యం తాగి అపట్లో పలువురు మృతిచెందగా వందలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే అప్పట్లో నమోదైన కేసుల వివరాలకు సంబంధించిన కొన్ని కీలక ఫైళ్లు 2018లో మిస్ అయినట్టు విజయవాడ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. ఈ క్రమంలో ఆ కేసును న్యాయస్థానం సీఐడీకి అప్పగించింది.

2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో సదరు కేసును దర్యాప్తు చేయకుండా నీరు కార్చారు. ప్రస్తుతం వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసుతోపాటు నకిలీమద్యం కేసు సైతం వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ మద్యం కేసులో కాకాణి అరెస్ట్ అవనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Comments are closed

Related Posts