తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక ఘట్టం కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 9, 2009 నాడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేసిన సందర్భంగా విజయ్- దివస్ గా నియోజకవర్గ కేంద్రాలలో విజయోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గలోని పడమరకోట చమాన్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ – దివాస్ విజయోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జంక్షన్ లోని బొడ్రాయికి కొబ్బరికాయ కొట్టి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి వేసి నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి గాల్లోకి బెలూన్లు ఎగరవేసారు.
అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రజలనుద్దేశించి నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులకు, నియోజకవర్గ ప్రజలకు విజయ్-దివాస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు డిసెంబర్ 9 అని, దశాబ్దాల ఆశ ఆవేదన ఆకాంక్షల ఉద్విఘ్నభరితంగా మారిన ఈరోజు ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టిన సుదినం అని, రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరుగని పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు ఆనాటి టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచిన అద్భుతమైన సందర్భం డిసెంబర్ 9 ప్రకటన అన్నారు. తాను సచ్చుడో -తెలంగాణ వచ్చుడో అంటూ అకుంఠిత దీక్షతో కేసిఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష యావత్ భారతదేశాన్ని కదిలించిందన్నారు నన్నపునేని.. తన ఉద్యమ నాయకుడు ఆరోగ్యం క్షేనిస్తున్నదన్న ఆందోళనతో తెలంగాణలోని ప్రతి ఒక్కరు రోడ్లెక్కి ఆందోళనకు దిగటంతో ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు. ప్రపంచ శాంతియుత ఉద్యమ చరిత్రలో తెలంగాణ ఉద్యమం ఒక అద్భుతమైన ఉద్విగ్నమైన ఘట్టమన్నారు, 16 సంవత్సరాల చరిత్రకు దినోత్సవాలు నిర్వహించడం అనేది గొప్ప విషయమని తెలిపారు.
స్వరాష్ట్రం కోసం 11 రోజుల ఆమరణ దీక్షను చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన రోజు డిసెంబర్ 9 అని, డిసెంబర్ 9 2009 నాడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వెలువడి తెలంగాణ ప్రజల ఆకాంక్షల సహకారానికి తొలి అడుగు పడ్డ చారిత్రక రోజుగా అభివర్ణించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ఇన్చార్జీలు మహిళా నాయకురాలు మరియు యువజన నాయకులు మరియు కార్యకర్తలు అనుబంధ సంస్థ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.














Comments are closed