Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • ప్రతి కుటుంబంలో ఏఐ ప్రొఫెషనల్ ఉండాలనేది చంద్రబాబు విజన్ – లోకేష్

ప్రతి కుటుంబంలో ఏఐ ప్రొఫెషనల్ ఉండాలనేది చంద్రబాబు విజన్ – లోకేష్

chb lokesh

భారతదేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రపథాన నిలుపుతామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రస్తుత ఏఐ యుగంలో నైపుణ్య రంగాల మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. దేశంలోనే యువ రాష్ట్రాలలో ఏపీ ఒకటి అని, ప్రస్తుతం ఏపీ 180బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందన్నారు. భవిష్యత్ లో ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్గా పనిచేస్తున్నామని, 15 శాతం వృద్ధితోనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు క్లస్టర్ విధానాన్ని నిర్ధేశించుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. ఇందుకు ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, సీబీజీ, ఓట్స్, ఆక్వా, రెన్యూవబుల్ ఎనర్జీ, ఏఐ సహా 20రంగాలను గుర్తించామని, ఆయా రంగాలను క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేస్తామన్నారు. అందుకు కావాల్సిన ఎకో సిస్టమ్ ను ఇప్పటికే ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. కియా గ్లోబల్ ఉత్పత్తిలో 9శాతం ఏపీ నుంచే వస్తోందని, దేశంలో తయారయ్యే ఏసీల్లో 50శాతం ఏపీ నుంచే తయారవుతున్నాయన్నారు. ఉత్పత్తి రంగాన్ని మరింత పెంచుతామన్నారు.

Comments are closed

Related Posts