Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • నెగటివ్ వద్దు… పాజిటివ్ ఆలోచనలతో పనిచేయండి – అధికారులకు సీఎం క్లాస్

నెగటివ్ వద్దు… పాజిటివ్ ఆలోచనలతో పనిచేయండి – అధికారులకు సీఎం క్లాస్

cm chandrababu

సీఎం చంద్రబాబు స్టైలే వేరు.. పనిచేయాలని హెచ్వోడీలు, కార్యదర్శుల సదస్సులో ముఖ్యమంత్రి సూచించారు. అధికారులు ప్రతికూల ఆలోచనలు చేయవద్దని, ప్రభుత్వం నుండి ఏ వర్క్ వచ్చినా, ఏ కార్యక్రమం తలపెట్టినా ఉత్సాహంగా పనిచేయాలన్నారు. కొందరు అధికారులు, సిబ్డంది ప్రతికూల ఆలోచనలు చేస్తున్నారని, ఆ పనిచేయకుండా ఎలా ఉండాలి అనేలా ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ పద్దతి విడనాడాలని కోరారు. నెగిటివ్ గా ఎప్పుడు ఆలోచించినా అది మనకు మంచి చేయదన్నారు.

ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చినపుడు సానుకూలంగా తీసుకుని దాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వంలో ఏ స్థాయి అధికారి అయినా పాజిటివ్ ఆలోచనలతో మాత్రమే పనిచేయాలని అప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయని వ్యాఖ్యానించారు.” నేను చూస్తున్నా.. చాలామంది అధికారులు ఎంతో అద్భుతంగా పనిచేస్తారు.. మంచి మంచి ఫలితాలను చూపిస్తారు అయితే వారి వ్యవహార శైలి, వారు అనుసరించే విధానం కూడా బావుండాలి. ప్రజలు, అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించే పద్ధతిని విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. ఎంత మంచిఫలితం సాధించినా.. ఎంత మంచిగా పనిచేసినా ఆ అధికారి ప్రవర్తన కూడా కూడా ముఖ్యమే” అన్నారు.

“ప్రభుత్వంలోని పలు శాఖల్లో 18నెలల్ ఎన్నో మార్పులు తెచ్చామని, దేవాదాయ, రెవెన్యూ శాఖల్లో ఇంకా మార్పులు రావాల్సి ఉందన్నారు. ఈ రెండు శాఖలు మరింత పికప్ కావాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల శ్రీవారి ఆలయంలో అనేక మార్పులు తెచ్చామని, ఆ తరహా మార్పులు దేవాదాయ శాఖలోని ప్రతి దేవాలయంలో వేగంగా రావాలన్నారు. ప్రభుత్ శాఖల్లో ప్రతి సేవ ఆన్ లైన్‌లో పొందే పరిస్థితి రావాలని, అన్ని సేవలు ఆన్ లైన్‌లో రావడానికి జనవరి 15న మాత్రమే డెడ్ లైన్ అని సూచించారు.. అందుకు అవసరమైన కసరత్తు పూర్తిచేసి ఆన్లైన్ లో సేవలు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Comments are closed

Related Posts