Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Telangana
  • Hyderabad
  • హరీష్ ను బయటకు, కేటీఆర్ ను జైలుకు పంపాలనేది కవిత ప్లాన్..?

హరీష్ ను బయటకు, కేటీఆర్ ను జైలుకు పంపాలనేది కవిత ప్లాన్..?

ktr kcr harish kavitha

అధికారంలో విపక్షాలను తమ అధికార బలంతో ఇబ్బందులకు గురిచేసిన భారత రాష్ట్ర సమితి ఇప్పుడు జాగృతి నాయకురాలు కవితను చూసి ఇబ్బంది పడుతోంది.. ఇంకా చెప్పాలంటే వణికిపోతోంది.కవిత రాజకీయాలను తట్టుకోలేక చీప్ పాలిటిక్స్ కు తెరలేపింది. కవిత కేసీఆర్ కుమార్తె అని అందరికీ తెలుసు. అయినా ఆమెను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుక్కతో పోల్చారు. ఇది అసలు మామూలు విషయం కాదు. వాస్తవానికి మాధవరం రెగ్యులర్ గా అలా మాట్లాడే మనిషి కాదు. ఆయనతో అలా మాట్లాడించారనే ఇప్పుడు అంతా అనుకుంటున్నారు. కేసీఆర్ సామాజికవర్గానికి చెందిన మాధవరంతో ఎక్కడా తేడా రాకుండా ప్రణాళికా బద్దంగా కవితపై మాటల దాడి చేయించారని తెలుస్తోంది. కవిత మొదటగా హరీష్ రావును బయటకు పంపాలని ప్రణాళికలు వేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. మాధవరం కూడా అదే చెప్పారు. ఆమె ఇటీవల స్పెసిఫిక్ గా హరిష్ రావును టార్గెట్ చేస్తున్నారు. తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

కవిత మాటల్లో.. హరీష్ రావుపై కేసీఆర్ లో అపనమ్మకం పెంచడమేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దాంతో హరీష్ వల్ల కేటీఆర్ కూ ముప్పు ఉంటుందని కవిత హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలో తన దీర్ఘ కాలిక రాజకీయ వ్యూహంలో భాగంగా.. ముందుగా బీఆర్ఎస్ నుంచి కవితను బయటకు పంపాలనే అనుకుంటున్నారని నిర్ణయానికి వచ్చారు. అందుకే హరీష్ రావును అందరూ ఏకపక్షంగా సమర్థిస్తున్నారు.. కానీ కవిత ప్రయత్నాలు ఫలించి ఎక్కడైనా హరీష్ పై అపనమ్మకం ఏర్పడినా… తనను అనుమానంగా చూస్తున్నారని హరీష్ కు అనిపించినా.. కవిత మొదటి అడుగులోనే సక్సెస్ అవుతారు. ఇది ఆమె వ్యూహం

హరీష్ రావును బయటకు పంపి తరువాత కేటీఆర్ పై దృష్టి పెడతారని మాధవరం కృష్ణారావు అన్నారు.. అంటే కేటీఆర్ ను జైలుకు పంపాలంటే అది రేవంత్ చేతుల్లోనే ఉందనేది మాధవరం మాట.. ఇప్పటికే కేటీఆర్ తనను అరెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చని పదే సవాల్ చేస్తున్నా ఆతరహా వాతావరణం కనిపించట్లేదు. దీనినిబట్టి హరీష్ ను బయటకు పంపిన తర్వాత కేటీఆర్ ను జైలుకు పంపించాలన్న ప్రణాళికతో కవిత ఉన్నారని.. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారని స్వయంగా బీఆర్ఎస్ నమ్ముతోంది. వాస్తవ పరిణామాలు అక్కడి వరకూ వస్తాయా లేదా అన్నది పక్కన పెడితే హరీష్ ను బయటకు పంపి.. కేటీఆర్ ను అరెస్టు చేయించిన తర్వాతే కవిత అప్పుడు బీఆర్ఎస్ ను క్యాప్చర్ చేస్తారనేది బీఆర్ఎస్ అనుమానం.. అదే ఆమె మాస్టర్ ప్లాన్ అని బీఆర్ఎస్ కూడా నమ్ముతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్ అనారోగ్యం వల్ల పార్టీని నడిపే పరిస్థితి లేకపోవడంతో హరీశ్ రావు లేకుండా..కేటీఆర్ జైలు పాలయిన తర్వాత ఇక కవిత నాయకత్వాన్ని కేటీఆర్, కేసీఆర్ ఇష్టం లేకపోయినా ఆమోదిస్తారని కవిత ప్లాన్ గురించి అనుమానిస్తున్న వారు అనుకుంటున్నారు. కేవలం అందుకోసమే జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటించకుండా కవిత అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

Comments are closed

Related Posts