సికింద్రాబాద్‌లో జరిగిన మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 13ఏళ్ల మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 4వ తేదీనుంచి అదృశ్యమైన తన కూతురి కోసం బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బాలిక సికింద్రాబాద్ పరిధిలోని ఉన్నట్లు పోలీసులు గుర్తించి లొకేషన్ ద్వారా ఆమెను ట్రేస్ చేసారు. విచారణలో ఈనెల 8వ తేదీన సికింద్రాబాద్ బస్టాండ్ వద్ద సంచరిస్తున్న బాలికను నిందితులు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలిసింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు నలుగురు నిందుతులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. నిందితుల్లో ఇద్దరికి 19 ఏళ్లు, మరో ఇద్దరికి 17ఏళ్ల మైనర్ బాలలుగా గుర్తించారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెద్దవారిని రిమాండ్‌కు, మైనర్లను జువెనైల్ హోంకు తరలించారు.













Comments are closed