Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Telangana
  • Hyderabad
  • మెస్సితో మ్యాచ్ జీవితకాల జ్ఞాపకం.. రేవంత్ తో ఢిల్లీకి ప్రయాణం

మెస్సితో మ్యాచ్ జీవితకాల జ్ఞాపకం.. రేవంత్ తో ఢిల్లీకి ప్రయాణం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సిల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ దేశం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌‌తో రేవంత్ అభిమానులు, క్రీడాభిమానులంతా ఖుషీ అయిపోయారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్‌‌రెడ్డి మెస్సికి ధన్యవాదాలు తెలిపారు. ‘మా ఆహ్వానాన్ని మన్నించి, హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచినందుకు GOAT లియోనెల్ మెస్సి, ఫుట్‌బాల్ దిగ్గజాలు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌‌లకు రేవంత్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మాతో చేరి నిన్న సాయంత్రం జీవితకాల జ్ఞాపకంగా మార్చినందుకు, నాయకుడు రాహుల్ గాంధీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ అంటే క్రీడలు, శ్రేష్ఠత, ఆతిథ్యం అని ఈ సందర్భంగా ప్రపంచానికి చాటిచెప్పాం. నగరమంతా విధుల్లో ఉన్న అన్నిశాఖల అధికారులు, భద్రతాసిబ్బంది, నిర్వాహకులు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తరపున, మాఅతిథులకు, క్రీడా ప్రేమికులు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం రేవంత్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగే మహార్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments are closed

Related Posts