హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగింది. మాసబ్‌ట్యాంక్ పరిధిలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (NEW) పోలీసులు నిర్వహించిన దాడుల్లో 11గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకున్నారు.
యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే నిందితులను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ మార్కెట్లో భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిందితుల మొబైల్ ఫోన్లు, ఇతర కీలక ఆధారాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా వెనుక నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోందని, మరికొందరు కీలకవ్యక్తులు ఈవ్యవహారంలో భాగస్వాములై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యంగా నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కఠిన చర్యలు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరించారు















Comments are closed