Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • వింటేజ్ లుక్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్..

వింటేజ్ లుక్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ’ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుంది.. ఈ సినిమాలో గోల్డెన్ లెగ్ శ్రీలీల, రాశీఖన్లునా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. చాలా రోజులుగా ఉస్తాద్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి తాజాగా విడుదలైన పాట మంచి ఊపునిస్తోంది. ‘దేఖలేంగే సాలా’ అనే సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లో చాలాకాలం తర్వాత వింటేజ్ పవన్‌ను గుర్తు చేసేలా ఆ స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

‘దేఖ్ లేంగే సాలా… చూసినాము చాలా’ అంటూ సాగిన ఈ లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో ఉంది. ఈ పాటకు రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బీజీఎం వేరే లెవల్ ఇవ్వగా… భాస్కర భట్ల రాసిన లిరిక్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఊపేస్తున్నాయి. ‘విశాల్ ధడ్లానీ’, హరిప్రియ పాటను అద్భుతంగా పాడారు. చాలా రోజుల తర్వాత పవన్ స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. పవన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పవన్, హరీష్ కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెండో సినిమా.. గతంలోనూ వీరి కాంబోలో వచ్చిన’గబ్బర్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్ండగా పార్తీబన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments are closed

Related Posts