Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Gadget
  • Desk
  • నిధికి చేదు అనుభవం.. ఇప్పటివరకూ స్పందించని రాజాసాబ్..

నిధికి చేదు అనుభవం.. ఇప్పటివరకూ స్పందించని రాజాసాబ్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో ఆమెకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘ది రాజా సాబ్. ఈసినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది.. ఈక్రమంలో రాజాసాబ్ సినిమాలోని ‘సహన సహన’ పాటను రిలీజ్ చేశారు టీమ్. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నిధి అగర్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్ ప్రశాంతంగా కంప్లీట్ అయ్యింది. కానీ హీరోయిన్ బయటకు వెళ్లే సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. అందరూ వచ్చి నిధి అగర్వాల్ మీద పడటంతో.. ఆమె కారు దగ్గరకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. ఈ ఘటనతో నిధి అగర్వాల్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అక్కడే ఉన్న బౌన్సర్లు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించి, ఎంతో శ్రమించి ఆమెను సురక్షితంగా కారు దగ్గరకు తీసుకొచ్చారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో, సెలబ్రిటీల భద్రతతో పాటు సినిమా ఈవెంట్ల నిర్వహణపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వైరల్ వీడియోలో గుంపులు గా ఉన్న జనాల మధ్య నుంచి.. తన కారు దగ్గరకు వెళ్లడానికి.. నిధి అగర్వాల్ ఎంత ఇబ్బంది పడింది అనేది స్పష్టంగా కనిపించింది. ఎలాగోలా.. కారు వరకూ వెళ్లి.. చివరకు కారులోకి ఎక్కిన వెంటనే ఆమె ఊపిరి పీల్చుకుని ” మై గాడ్ ” అన్నట్టు కనిపిస్తోంది.

Comments are closed

Related Posts