ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో చెరగని నమ్మకం ఏర్పడిందని, ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ దే అన్న విధంగా తెలంగాణ పరిస్థితులు ఉన్నాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఐవీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఈ పంచాయితీ ఎన్నికలతో పల్లెల్లో కాంగ్రెస్ సునామీ ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాలో 70% స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం రేవంత్ రెడ్డి పాలనా దక్షతకు నిదర్శనమన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మొత్తం మూడు విడతల్లో విజయం సాధించడం ద్వారా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ మరింత బలపడిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం, తెలంగాణ రైజింగ్ పేరుతో అభివృద్ధి కోసం సీఎం రేవంత్ పడుతున్న తపనను గ్రామాల్లోని ప్రజలు సైతం అర్ధం చేసుకున్నారని ఉప్పల శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా అవతరించిందన్నారు ఉప్పల.















Comments are closed