తెలుగు ఫిల్మ్ అండ్ టీ.వీ. డాన్సర్స్ & డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫిల్మ్ నగర్లోని ఫిల్మ్ ఛాంబర్ హాల్లో ఘనంగా నిర్వహించారు.. సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన ప్రముఖ డాన్సర్లు, డాన్స్ డైరెక్టర్లు, కళాకారులు, అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యరు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు వల్లాల నవీన్ యాదవ్ హాజరై, అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు..
అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వి.వి.సుమలత దేవి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సత్కరించారు. ఆమె నాయకత్వంలో అసోసియేషన్ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు.. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో డాన్సర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. సినిమా విజయంలో పాటలు, నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, అలాంటి నృత్యాలకు ప్రాణం పోసేది డాన్సర్లు, డాన్స్ మాస్టర్లేనని ప్రశంసించారు..
డాన్సర్లు అనేక కష్టాలు, త్యాగాలతో ఈ రంగంలో నిలదొక్కుకుంటారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సుమలత భర్త జానీ మాస్టర్ ను అభినందించారు. అధ్యక్షురాలు వీవీ సుమలత దేవి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.. డాన్సర్లు, డాన్స్ డైరెక్టర్ల హక్కుల పరిరక్షణ, వృత్తి పరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆమె తెలిపారు..














Comments are closed