ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు మార్పుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ ‘వీబీ-జీ రామ్ జీ’ అనేపేరుతో (VB-G RAM G)బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ద్వారా ఈ పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం, దాని స్వరూపాన్ని మార్చడం ప్రజాస్వామ్య విరుద్ధమంటూ ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్నారు.
హైదరాబాద్ లో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షులు నిరసన వ్యక్తంచేసారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షులు మాలిచేటి రాజీవ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధిహామీ చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం పట్ల మండిపడ్డారు.
చరిత్రాత్మకమైన ఉపాధి హామీ చట్టాన్ని నీరుకార్చడానికి మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, కోట్లాదిమంది పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. పార్లమెంట్‌లో సరైన చర్చ లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అన్నారు. ఈ మార్పుల వల్ల కోట్లాదిమంది పేద ప్రజలు, రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్ చేశారు.
గత పదేళ్లుగా ఈ చట్టాన్ని బలహీనపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, ఇప్పుడు ఏకంగా చట్టం అస్తిత్వాన్నే దెబ్బతీసేలా అడుగులు వేస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం ఉపాధి హామీ నిధులవాటాలో 100శాతం 60శాతానికి తగ్గించుకుందని, ఈ విధంగా 40శాతం కోత విధించడంతో రాష్ట్రాలపై తీవ్రమైన ఆర్ధిక భారం పడనుందని రాజీవ్ రెడ్డి విమర్శించారు.














Comments are closed