Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • ప్రధాని రేసులో చంద్రబాబు, లోకేష్.. రాయిటర్స్ సంచలనం

ప్రధాని రేసులో చంద్రబాబు, లోకేష్.. రాయిటర్స్ సంచలనం

తాజాగా ప్రముఖ జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ సంచలన విశ్లేషణ బయటపెట్టింది. 2029సార్వత్రిక ఎన్నికల నాటికి భారత ప్రధానిమోదీ వయస్సు 79 ఏళ్లకు చేరుతుందని, ఆ సమయంలో ఆయన క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటే వారసులెవరు అనే కోణంలో ఒక ఆసక్తికర అనాలసిస్ చేసింది. ఈ సందర్భంగా దేశ ప్రధాని రేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పేర్లను సైతం ప్రస్తావించింది. ఒకవేళ 2029లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే, ఎన్డీయే కూటమిలోని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే.. అప్పుడు దక్షిణాది నేతగా చంద్రబాబుకు, లేదా ఆయన తనయుడులోకేష్‌కు అవకాశం దక్కవచ్చని రాయిటర్స్ అభిప్రాయపడింది.

రాయిటర్స్ వెల్లడించిన ఎనాలసిస్ ప్రకారం వెలువరించిన విశ్లేషణ ప్రకారం, బిజెపిలో మోదీ తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న అమిత్ షా మొదటి వరుసలో ఉన్నారు. తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ పేరును కూడా రాయిటర్స్ పరిగణనలోకి తీసుకుంది. అయితే క్షేత్రస్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరును మాత్రం రాయిటర్స్ విస్మరించింది. మోదీ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న యోగిని కాదని ఫడ్నవీస్ పేరును తెరపైకి తేవడం వెనుక రాయిటర్స్ లాజిక్ ఏంటన్నది ప్రశ్నార్థకం. అలాగే బీజేపీకి కీలకంగా ఉపయోగపడుతూ.. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలైనా ప్రచారం చేసే నేత, మోదీ పవన్ కాదు.. తుఫాన్ అని ప్రస్తావించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును సైతం రాయిటర్స్ ప్రస్తావించలేదు..

Comments are closed

Related Posts