Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Blog
  • బేల్ ట్రీ కిచెన్ ప్రారంభించిన మోనాలిసా.! ఏం ఖర్మరా బాబు..

బేల్ ట్రీ కిచెన్ ప్రారంభించిన మోనాలిసా.! ఏం ఖర్మరా బాబు..

హైదరాబాద్ లోని ప్రముఖ ఆతిథ్యరంగ సంస్థ ‘బేల్ ట్రీ హోటల్’ తన సేవలను మరింత విస్తరిస్తోంది. అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన కిచెన్ విభాగాన్ని’కుంభమేళా’ ఫేమ్ మోనాలిసా ప్రారంభించారు. హోటల్ యాజమాన్యం మోనాలిసాకు ఘనస్వాగతం పలకగా రిబ్బన్ కట్ చేసి, సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె కిచెన్ విభాగాన్ని ప్రారంభించరు.

అనంతరం మోనాలిసా మాట్లాడుతూ.. “బేల్ ట్రీ హోటల్ కిచెన్ విభాగం చాలా శుభ్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందని, ఆహార ప్రియులకు అద్భుతమైన రుచులు అందిస్తున్నారనిఅన్నారు. షెఫ్‌ల నైపుణ్యాన్ని అభినందించారు.

ఈ సందర్బంగా.. బేల్ ట్రీ హోటల్స్ అధినేత రాజారెడ్డి మాట్లాడుతూ “మేము మా హోటల్‌కు ‘బేల్ ట్రీ’ అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం శివుడు అని, బేల్ ట్రీ అంటే తెలుగులో బిల్వ వృక్షం.. బిల్వ పత్రం అంటే ఆ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది.

‘త్రిదళం త్రిగుణాకారం’ అంటూ మనం పూజించే ఆ బిల్వ దళాల చెట్టు పేరునే తమ సంస్థకు పెట్టుకోవడం గర్వకారణమన్నారు. కాశీ అన్నపూర్ణేశ్వరి సమేతుడైన ఆవిశ్వేశ్వరుని ఆశీస్సులు తమపై ఉండాలని కోరుకుంటున్నామన్నారు.

వ్యాపార పరంగా ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ, ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉన్న బిల్వ వృక్షం పేరును ఎంచుకోవడం వెనుక ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉందన్నారు. మోనాలిసాను చూసేందుకు వచ్చినవారిని ఆమె నవ్వుతూ, అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు.

కొంతమంది అభిమానులతో సెల్ఫీలు దిగి వారిని ఖుషీ చేశారు. అయితే కొందరు మాత్రం ఆమె గురించి నెగిటివ్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మొన్నటివరకూ పూసలమ్మింది.. ఈమధ్య హీరోయిన్ అయ్యింది.. ఇప్పుడేమో ఏకంగా హోటల్ కిచెన్ ఓపెనింగ్ ఏం ఖర్మరా బాబు అని కామెంట్స్ చేస్తున్నారు..

Comments are closed

Related Posts