రోజూ రోజుకీ అభిమానుల అత్యుత్సాహంతో హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారు. మొన్న ‘రాజా సాబ్’ మూవీ సెకండ్ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌కి వెళ్లిన హీరోయిన్ నిధి అగర్వాల్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఈవెంట్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్తున్న నిధిపైకి ఎగబడిన అభిమానులు, ఆమెను అసభ్యంగా తాగుతూ, లాగుతూ రాక్షసంగా ప్రవర్తించారు. ఈ ఘటన మరవక ముందే హీరోయిన్ సమంతకు అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. డిసెంబర్ 21న హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర ఓ షోరూమ్ ఓపెనింగ్‌కి ముఖ్ అతిథిగా హాజరైంది సమంత.. ప్రారంభోత్సవం తర్వాత తిరిగి వెళ్తున్న సమంతతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో సమంత, ఇబ్బంది పడుతూ వారిని తప్పించుకుని కారు ఎక్కింది..

ఈ రెండు సంఘటనలు కూడా హైదరాబాద్ కూకట్పల్లి, జూబ్లీహిల్స్ ఏరియాల్లో జరిగాయి.. అయినా ఎందుకు ఇలా విచక్షణారహితంగా వ్యవహరించారు.. తప్పు ఎక్కడ జరుగుతోంది..? హీరోలు కనిపిస్తే వీరావేశంతో అరుస్తూ, అభిమానాన్ని నిరూపించుకోవాలని చొక్కాలు చింపుకునే వెర్రి ఫ్యాన్స్.. చాలా మంది ఉన్నారు. అదే హీరోయిన్ కనిపిస్తే అరుస్తూ, గేలి చేస్తూ, అవకాశం దొరికితే తాకేందుకు ప్రయత్నిస్తున్నారు.
సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలతో ఫోటోలు దిగి దాన్ని షేర్ చేసి లైకులు, కామెంట్లు తెచ్చుకోవడం గొప్ప ఘనతగా మారిపోయింది.. దీంతో జనాల్లో సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగాలనే పిచ్చి బాగా పెరిగిపోయింది. దీంతో అవతలి వాళ్లకు ఇబ్బంది కలుగుతోందనే ఇంగితం కూడా మరిచి వ్యవహరిస్తున్నారు.. ఈ ఘటనలు చూస్తుంటే మాత్రం మనం పేరుకి 20వ శతాబ్దంలో ఉన్నాం, కానీ విచక్షణాజ్ఞానం మాత్రం ఎక్కడో అడవుల్లోనే ఆగిపోయిందేమో అనిపిస్తోంది..

Comments are closed