Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Blog
  • ‘భర్త మహాశయులకు రవితేజ విజ్ఞప్తి’ మెగాస్టార్ వాయిస్..

‘భర్త మహాశయులకు రవితేజ విజ్ఞప్తి’ మెగాస్టార్ వాయిస్..

మాస్ మహరాజా రవితేజ హీరోగా దర్శకుడు కిశోర్‌ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేసారు.. ఈ టీజర్ లో ‘వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా’ అంటూ రవితేజ తనదైన శైలిలో కామెడీ పండించారు. వినోదభరితంగా సున్నితమైన అంశాన్ని ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్లు టీజర్ తెలియజేస్తోంది. 2026 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారట.

ఇప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పేరున్న కిశోర్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలున్నాయి. తాజాగా చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.

సినిమాలో రవితేజ పాత్రను పరిచయం చేసేందుకు, అలాగే కథలోని కొన్ని కీలక సందర్భాల్లో చిరంజీవి తన గంభీర స్వరంతో వాయిస్ అందించనున్నారని తెలుస్తోంది. మెగా వాయిస్ తోడవ్వడంతో సినిమాస్థాయి మరింత పెరిగిందని, ఇది ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని యూనిట్ భావిస్తోంది.

అలాగే సినిమా వ్యాపార ఒప్పందాలను పూర్తి చేసుకుంది. సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. థియేట్రికల్ విడుదల తర్వాత ఈ సినిమా జీ 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుందని, శాటిలైట్ హక్కులను జీ తెలుగు, జీ సినిమా ఛానెళ్లు దక్కించుకున్నాయి.

జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Comments are closed

Related Posts