Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Movie
  • Crime
  • భార్యపై పెట్రోల్ పోసి కాల్చి చంపి, కూతురిని మంటల్లో తోసిన భర్త

భార్యపై పెట్రోల్ పోసి కాల్చి చంపి, కూతురిని మంటల్లో తోసిన భర్త

హైదరాబాద్ లోని నల్లకుంటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమవివాహం చేసుకున్న దంపతుల మధ్య అనుమానాలు దారుణానికి దారితీశాయి. నల్గొండ జిల్లాకు చెందిన త్రివేణి, వెంకటేష్ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.

వెంకటేష్ భార్యపై అనుమానాలు పెంచుకుని తరచూ వేధిస్తుండంతో భార్య త్రివేణి పుట్టింటికి వెళ్లిపోవడానికి కారణమైంది. దాంతో ఆమెపై కోపం పెంచుకున్న వెంకటేష్ భార్యను తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చిన కొద్ది రోజుల్లోనే దారుణ హత్యకు దిగాడు.

పిల్లల ముందే పెట్రోల్ పోసి త్రివేణికి నిప్పటించాడు.. అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో తోసేశాడు. వారి అరుపులు, కేకలు విని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

మంటల్లో కాలిన త్రివేణి ఆసుపత్రికి చేరుకునేలోపే మరణించింది. కూతురు మాత్రం స్వల్ప గాయాలతో తప్పించుకుంది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటేష్‌ను అరెస్ట్ చేశారు.

Comments are closed

Related Posts