Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Blog
  • రంగా వర్ధంతి నాడు మార్రుమోగుతున్న “మూడుపూల వనములోన”

రంగా వర్ధంతి నాడు మార్రుమోగుతున్న “మూడుపూల వనములోన”

బడుగు, బలహీన వర్గాల నాయకుడు దివంగత వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని అన్ని పార్టీల కాపు సంఘం నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు లర్పిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం రంగా చేసిన కృషి మరువలేనిదని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు అండగా తాము నిలబడతామని తెలిపారు. రంగా కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహా నాయకుడు అని తెలిపారు.

పార్టీలకతీతంగా వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానం, రక్తదానం సహా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్ సహా రాష్ట్రవ్యాప్తంగా నేతలందరూ రంగా వర్ధంతి నివాళులర్పించారు. ఆయన తెలుగు జాతికి చేసిన సేవలను కొనియాడారు.

ప్రత్యేకించి విజయవాడలో రంగా వర్ధంతి వేడుకలు స్వచ్చంధంగా ఘనంగా నిర్వహించారు. కార్మికులు, యూనియన్లు నివాళులర్పించారు. రంగా స్మృతితో మూడుపూల వనములోన పువ్వు రాలిందో నగా దారిలో అనే పాట విజయవాడలో మారుమ్రోగుతోంది.

Comments are closed

Related Posts