మన దేశంలో క్రిస్మస్ తర్వాత రోజు బాక్సింగ్ డే ను నిర్వహిస్తారని చాలామందికి తెలుసు.. కానీ ఈ బాక్సింగ్ డేను ఎందుకు నిర్వహిస్తారు..? ఆరోజు విశేషం ఏమిటి అనే విషయం చాలామందికి తెలియదు.. అయితే బాక్సింగ్ డే అనేది యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ సహా బ్రిటిష్ కామన్వెల్త్ దేశాలలో జరుపుకునే ప్రభుత్వ సెలవురోజు.. ఇది డిసెంబర్ 26న వస్తుంది.. దీని గుర్తించే చాలా దేశాలలో ఇది జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. బాక్సింగ్ డే సెయింట్ స్టీఫెన్ విందు నుండి ఉద్భవించింది, దీనిని బ్రిటన్‌లో సాంప్రదాయకంగా క్రిస్మస్ తర్వాత రోజు నిర్వహిస్తారు. ఐర్లాండ్‌లో, బాక్సింగ్ డేను ఇప్పటికీ సెయింట్ స్టీఫెన్స్ డే అని పిలుస్తారు. సెయింట్ స్టీఫెన్ అనే వ్యక్తి క్రైస్తవ చరిత్రలో మొదటి అమరవీరుడు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లో అయితే సాంప్రదాయ నక్కల వేట, గుర్రపు పందాలు బాక్సింగ్ డేతో ముడిపడి ఉన్నాయి. ఈ సెలవుదినాన్ని జరుపుకునే చాలా దేశాల్లో బాక్సింగ్ డే సంవత్సరంలో షాపింగ్ అత్యంత రద్దీగా ఉండే రోజుగా నిలిచింది. అలాగే బ్రిటన్‌లోని భూస్వామ్య వ్యవస్థకు సంబంధించి, 19వ శతాబ్దంలో విక్టోరియన్ కాలంలో ధనిక వర్గాల ఇళ్లలో పనిచేసేవారు క్రిస్మస్ రోజు సెలవు లేకుండా యజమానులకు పని చేసేవారు.
అందుకే వారికి తర్వాతి రోజైన డిసెంబర్ 26న సెలవు ఇచ్చేవారు. క్రిస్మస్ వేడుకల్లో మిగిలిన పిండివంటలు, బహుమతులు, బట్టలు వంటి చిన్నచిన్న బాక్సులలో పెట్టి యజమానులు తమ పనివారికి అందించేవారు. ఆ బాక్సులు తీసుకున్న పనివారు బాక్సులు పట్టుకుని 26వ తారీఖున పండుగ జరుపునేవారట. ఆలా బాక్సులలో పెట్టి ఇవ్వడంతో బాక్సింగ్ డే అనే పేరువచ్చింది అనేది చరిత్..
అలాగే పూర్వం రోజుల్లో చర్చిల బయట పేదల కోసం విరాళాలు సేకరించే పెట్టెలు పెట్టేవారు. క్రిస్మస్ సందర్భంగా చర్చి లకు వచ్చిన జనం ఆపెట్టెల్లో విరాళాలను వేసావారు. ఆ పెట్టెలను డిసెంబర్ 26 న తెరిచి పేదలకు పంచేవారు. ఆలా బాక్సులు ఓపెన్ చేసి చేసే ఇవ్వడం వల్ల ఈ రోజును ఈ పేరుతో పిలుస్తుంటారు. బాక్సింగ్ డే క్రమంగా ప్రపంచంలోనే చాలా దేశాల్లో అతిపెద్ద ‘షాపింగ్ సేల్’ రోజుగా మారిపోతోంది.. అమెరికా వంటి దేశాల్లో బ్లాక్ ఫ్రైడే తరహాలో ఎలక్ట్రానిక్స్, బట్టలు మరియు ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. ప్రజలు తెల్లవారు జాము నుండే దుకాణాల ముందు క్యూలు కడతారు.
అలాగే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రతిఏటా జరిగే ‘బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్’ కూడా చాలా పాపులర్. అలాగే ఇంగ్లాండ్‌లో ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఎంతో ఉత్సాహంగా జరుగుతాయి.. క్రిస్మస్ రోజు కేవలం కుటుంబ సభ్యులతో ఈ పండుగ జరుపుకుని ఈ బాక్సింగ్ డే రోజు మాత్రం స్నేహితులు, దూరపు బంధువులను కలిసి సంతోషంగా సెలెబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా మారింది. రెస్టారెంట్లకు, పార్కులకు వెళ్లడం సంతోషంగా భోజనాలు చేయటం అలా ఒక గుర్తుండిపోయే రోజుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.









Comments are closed