ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విద్యార్థుల చదువు అలవాట్లలో మార్పు తీసుకొచ్చేలా కీలకనిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనం తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లకు అలవాటుపడకుండా, పుస్తకాలు చదివే అలవాటు పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ఉదయం అసెంబ్లీ సమయంలో 10 నిమిషాల పాటు న్యూస్ పేపర్ చదివించాలి అని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ప్రతి పాఠశాల లైబ్రరీలో తప్పనిసరిగా హిందీ, ఇంగ్లీష్ వార్తా పత్రికలు అందుబాటులో ఉంచాలని సూచించింది. ఈ విధానం ద్వారా విద్యార్థుల్లో సాధారణ జ్ఞానం, భాషా నైపుణ్యం, సమాజంపై అవగాహన పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యావేత్తలు సానుకూల స్పందన వ్యక్తం చేస్తున్నారు.










Comments are closed