ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రక్త తర్పణం చేసిన వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఆర్టీఐ వింగ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, అడ్వకేట్ సౌమ్య కౌంటర్ ఇచ్చారు. గతంలో బాలకృష్ణ సినిమా రిలీజ్ రోజు 20 పొట్టేళ్ల తలలు నరికి దండలు కడితే ఏం చేశారు.. చంద్రబాబు ఫ్లెక్సీలకు పొట్టేళ్ఖను బలి ఇచ్చినపుడు రోజు జీవహింస, రాక్షస సంస్కృతి హోంమంత్రి అనితకు కనపడలేదా.? అని సౌమ్య ప్రశ్నించారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రాపకం కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడితే వైసీపీని అభిమానించే కోట్లాదిమంది సహించబోరన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జగన్ మోహన్ రెడ్డిగారి వెంటే ఉంటామన్నారు. తాత్కాలికంగా మీరు అధికారంలో ఉండవచ్చు కానీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని, హోం మినిష్టర్ గా అనిత ఫెయిల్ అయ్యారని సౌమ్య విమర్శించారు. రాష్ట్రంలోని దళిత బిడ్డలకు సరైన విద్య, వైద్య సదుపాయాలు అందుతున్నాయా అనే విషయాలపై దృష్టి సారించాలని హితవు పలికారు..














Comments are closed