Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • New Division : బనగానపల్లెలో రెవిన్యూ డివిజన్ ప్రారంభం.. మంత్రి బీసీ హర్షం

New Division : బనగానపల్లెలో రెవిన్యూ డివిజన్ ప్రారంభం.. మంత్రి బీసీ హర్షం

బనగానపల్లెలో నూతన రెవిన్యూ డివిజన్ కార్యకలాపాలు ప్రారంభమవుతుండడంతో రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. బనగానపల్లె నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బనగానపల్లెకి కొత్త రెవెన్యూ డివిజన్ – గెజిట్ విడుదల చేసిన సందర్భంగా బీసీ మాట్లాడుతూ నేటినుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. నూతన సంవత్సరంలో బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ను కానుక ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి బనగానపల్లె వాసుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

బనగానపల్లె వాసుల చిరకాల వాంఛ తనహయాంలో నెరవేరడం వ్యక్తిగతంగా సంతృప్తిని కలిగించిందని, గతంలో సంజామల, కొలిమిగుండ్ల మండలాలు నంద్యాల రెవిన్యూ డివిజన్ పరిధిలో బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల మండలాలు డోన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడేవారని, ఆర్డీవో కార్యాలయంలో ఏదైనా పని నిమిత్తం నంద్యాల, డోన్ లకు వెళ్లాల్సి రావడం ప్రజలకు వ్యయ, ప్రయాసలుగా మారేదన్నారు. ప్రజల మనోభావాల మేరకు మొత్తం బనగానపల్లె నియోజకవర్గంలోని 5మండలాలను ఒకే రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. ప్రజల ఆకాంక్షలు, పరిపాలన సౌలభ్యం కొరకు ఏర్పాటుచేసిన కొత్త రెవిన్యూ డివిజన్ కార్యకలాపాలు సమర్థవంతంగా, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానన్నారు.

Comments are closed

Related Posts