తెలంగాణ ఉద్యమకారులతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భూ పోరాటం చేసేందుకు ప్రణాళిక రచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయడానికి కవిత తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను సన్నద్ధం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇంటి స్థలాల హామీని నెరవేర్చకపోవడంతో డిసెంబర్ 9వ తేదీలోగా ఆ హామీని నెరవేర్చకుంటే భూ పోరాటాలు చేస్తామని కవిత స్పష్టం చేసారు.
దాంతో కరీంనగర్ నుంచి భూ పోరాటానికి శ్రీకారం చుట్టారు. కమ్యూనిస్ట్ పార్టీల తరహాలో కవిత భూ పోరాటాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమిస్తానని కవిత చెప్తుండడం ఇదంతా వ్యూహం ప్రకారమే జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కవితను తెలంగాణ ప్రజలు పట్టించుకోవట్లేదని, ఈ తరహా కార్యక్రమాల ద్వారా అయినా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయకూడదని, బీఆర్ఎస్ కు మాత్రమే కవిత వల్ల డ్యామేజ్ జరుగుతుండడంతో ఇప్పుడు కవిత అంశాన్ని రేవంత్ సీరియస్ గా తీసుకోవడం లేదని, అదే కాంగ్రెస్ కు ఏమాత్రం ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా రేవంత్ కవితకు ఈజీగా చెక్ పెడతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.














Comments are closed