సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించి, రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న లెజెండరీ మ్యూజిక్ డైరక్టర్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. దశాబ్దాల కాలంగా తెరవెనుకే తన స్వరాలతో అందరినీ మంత్రముగ్ధులను చేసిన రెహమాన్ ఇప్పుడు మొదటిసారి వెండితెరపై నటుడిగా కనిపించనున్నారు.
మనోజ్ ఎన్.ఎస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మూన్‌వాక్’ అనే చిత్రం ద్వారా ఆయన ఈ వినూత్న ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ సినిమాలో రెహమాన్ పోషిస్తున్న యువ సినిమా దర్శకుడి పాత్ర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్రబృందం నమ్ముతోంది. కేవలం నటనకే పరిమితం కాకుండా, సినిమాలోని ఐదుపాటలను ఆయనే పాడారు. ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ ప్రభుదేవా.. ‘బాబూట్టి’ అనే ఉత్సాహవంతుడైన కొరియోగ్రాఫర్ పాత్రలో ప్రభుదేవా నటిస్తున్నారు. ‘మయిలే’ అనే పాట చిత్రీకరణ సమయంలో ప్రభుదేవా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి అదిరిపోయేలా డ్యాన్స్ చేసారని అంటున్నారు. ఏదేమైనా ఇద్దరు గొప్ప కళాకారులు ఒకే సినిమాలో నటిస్తుండడం వారి అభిమానులకు నిజంగా పండుగే..










Comments are closed