అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, కొలంబియాలో నివసిస్తున్న 27ఏళ్ల నికిత గోడిశాల (27) అనే యువతి హత్యకు గురైన ఘటనపై ప్రవాసాంధ్రులు ఆందోళన చెందుతున్నారు.
నికిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన స్నేహితుడే ఆమెను హత్యచేసి ఇండియాకు పారిపోయినట్లు అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. నికిత చివరిసారి డిసెంబర్ 31న ఎల్లికాట్ సిటీలో కనిపించిందని ఆమె స్నేహితుడు అర్జున్ శర్మ (26) పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదు చేసిన వెంటనే అర్జున్ ఇండియాకు పారిపోవడంతో అతనిపై పోలీసులకు అనుమానం బలపడింది.
ఈక్రమంలో సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు అర్జున్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహించగా, అక్కడ విగతజీవిగా పడివున్న నికిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై కత్తిపోటు గాయాలు ఉండటంతో ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. నికితను హత్యచేసిన అనంతరం అర్జున్ శర్మ ఇండియాకు పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతనిని అరెస్ట్ చేసేందుకు ఫెడరల్ పోలీసుల సహాయాన్ని కోరారు. ఈకేసు అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తునకు వెళ్లింది.
హత్యకు గురైన నికిత గోడిశాల హైదరాబాద్ లోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతిగా గుర్తించారు. ఈఘటనపై ఆమె కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. అమెరికాలో మరోసారి తెలుగు యువతి హత్య జరగడంపై యావత్ ప్రవాస తెలుగు సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్కడ నికితకు నివాళులర్పిస్తున్నారు.అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, కొలంబియాలో నివసిస్తున్న 27ఏళ్ల నికిత గోడిశాల (27) అనే యువతి హత్యకు గురైన ఘటనపై ప్రవాసాంధ్రులు ఆందోళన చెందుతున్నారు. నికిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన స్నేహితుడే ఆమెను హత్యచేసి ఇండియాకు పారిపోయినట్లు అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. నికిత చివరిసారి డిసెంబర్ 31న ఎల్లికాట్ సిటీలో కనిపించిందని ఆమె స్నేహితుడు అర్జున్ శర్మ (26) పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదు చేసిన వెంటనే అర్జున్ ఇండియాకు పారిపోవడంతో అతనిపై పోలీసులకు అనుమానం బలపడింది.
ఈక్రమంలో సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు అర్జున్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహించగా, అక్కడ విగతజీవిగా పడివున్న నికిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై కత్తిపోటు గాయాలు ఉండటంతో ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. నికితను హత్యచేసిన అనంతరం అర్జున్ శర్మ ఇండియాకు పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతనిని అరెస్ట్ చేసేందుకు ఫెడరల్ పోలీసుల సహాయాన్ని కోరారు. ఈకేసు అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తునకు వెళ్లింది.
హత్యకు గురైన నికిత గోడిశాల హైదరాబాద్ లోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతిగా గుర్తించారు. ఈఘటనపై ఆమె కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. అమెరికాలో మరోసారి తెలుగు యువతి హత్య జరగడంపై యావత్ ప్రవాస తెలుగు సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్కడ నికితకు నివాళులర్పిస్తున్నారు.

Comments are closed