Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • International
  • అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు.. అనుమానితుడి అరెస్ట్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు.. అనుమానితుడి అరెస్ట్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నివాసంపై కాల్పులు జరగడం కలకలం రేపింది. ఒహయో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో ఉన్న ఆయన ఇంటిని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.

కాల్పులు జరిగిన సమయంలో జేడీ వాన్స్ ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను కట్టుదిట్టంగా తనిఖీ చేశారు. అనంతరం అనుమానితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

ఈ దాడి వెనుక కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో జేడీ వాన్స్ భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments are closed

Related Posts