Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • Sai Devote : వెనిజులా కొత్త అధ్యక్షురాలు సత్యసాయి భక్తురాలే..!

Sai Devote : వెనిజులా కొత్త అధ్యక్షురాలు సత్యసాయి భక్తురాలే..!

సిద్ధాంతపరంగా వామపక్ష భావజాలం ఉన్నా వెనిజులా దేశాధినేతలకు సత్యసాయితో ఉన్న అనుబంధం, పుట్టపర్తిపై ఉన్న భక్తి ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాయకురాలు రో డ్రిగ్జ్ 2024లో ప్రశాంతి నిలయాన్ని సందర్శించి బాబాపై తన భక్తిని చాటుకున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అమెరికా ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కూడా సత్యసాయి బాబాకి పరమభక్తుడు. ముదురో కేవలం సాధారణ భక్తుడు మాత్రమే కాదు.. తన కార్యాలయంలోనూ బాబా ఫోటోను కూడా ఉంచుకుంటారు. 2005లో మదురో తన భార్యతో కలిసి పుట్టపర్తిని సందర్శించి, బాబా ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన బాబాను ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా, మానవతావాదిగా మదురో అభివర్ణించారు. మదురో కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్న హ్యూగో చావెజ్ హయాం నుండే వెనిజులా ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో సాయి భక్తి వేళ్లూనుకుంది.

తాజాగా బాధ్యతలు చేపట్టిన రోడ్రిగ్జ్ కూడా రెండేళ్ల కిందట పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నివాళి అర్పిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. కమ్యూనిస్టు భావజాలం కలిగిన దేశాల్లో దైవచింతన తక్కువగా ఉంటుందన్న అంచనాలను వెనిజులా నేతలు పటాపంచలు చేస్తూ.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆదేశ నేతలు పుట్టపర్తిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Comments are closed

Related Posts