Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • desk
  • Modi Property :భారీగా పెరిగిన మోదీ ఆస్తులు..

Modi Property :భారీగా పెరిగిన మోదీ ఆస్తులు..

దేశంలో ఎంపీల ఆస్తులు భారీగా పెరిగాయి. అదే సమయంలో గత పదేండ్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆస్తులు కూడా దాదాపు 80 శాతం పెరిగింది. ఈ మేరకు ఏడీఆర్‌ (Association for Democratic Reforms) నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం..

2014లో ఎంపీగా పోటీ చేసిన సమయంలో మోదీ దాఖలుచేసిన అఫిడవిట్ ప్రకారం.. తన ఆస్తుల విలువ రూ.1.65కోట్లుగా ప్రకటించారు. కానీ ఈ పదేండ్లలో మోదీ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. దాదాపు 80 శాతం ఆస్తుల్లో వృద్ధి కనిపించింది. ప్రస్తుతం ప్రధాని ఆస్తుల విలువ రూ.3,02,06889కు చేరింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ నిల్వల రూపంలోనే ఈ ఆస్తులు ఉన్నాయి. ఇక ప్రధానికి సొంతంగా కారు, ఇతర స్థిరాస్తులు లేవు. ఈ పదేండ్లలో మోదీ ఆస్తుల్లో వృద్ధి నమోదైనప్పటికీ దేశంలోని ఎంపీలతో పోలిస్తే పూరెస్ట్‌ పర్సన్‌ కావడం గమనార్హం.

అలాగే కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తుల్లోనూ భారీ మార్పు కనిపించింది. 2014ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఆస్తులవిలువ రూ.9.4కోట్లుగా ఉంది. 2024నాటికి అది రూ.20.39కోట్లకు పెరిగింది. ఈపదేండ్ల కాలంలో ఆయన సంపద దాదాపు 117శాతం వృద్ధిచెందింది. రాహుల్ పెట్టుబడులు ప్రధానంగా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, స్థిరాస్తుల రూపంలో ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. అలాగే దేశంలో పదేళ్లపాటు ఎంపీలుగా కొనసాగుతన్న వారి ఆస్తులు సుమారు 110శాతం మేర పెరిగినట్లు సదరు నివేదిక పేర్కొంది. ఎంపీల సంపద వృద్ధిపై ఏడీఆర్ నివేదిక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

Comments are closed

Related Posts