వైసీపీలాంటి రప్పా.. రప్పా.. రాజకీయ విధానం తమది కాదని మంత్రి లోకేష్ (Minister Lokesh) అన్నారు. జగన్‌లా ప్రజల్ని భయపెట్టడం, బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం వంటివి తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ ఎంతమేర సేవ చేసామన్నదే మన అజెండా కావాలన్నారు. అభివృద్ధి – సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూర్చామన్నదే కూటమిప్రభుత్వ విధానమని తేల్చిచెప్పారు. వైసీపీ కుట్రలను టీడీపీ నేతలు సమర్ధవంతంగా తిప్పికొట్టాలని, పార్లమెంట్ కేంద్రాల్లో నేతలు ఏకతాటిపై వైసీపీ అసత్య ప్రచారాలకు ధీటుగా బదులివ్వాలని లోకేష్ సూచించారు.














Comments are closed