భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా టీమ్ ప్రస్తుతం కవిత ఆదర్యంలోని జాగృతి ట్రాప్లో పడినట్లు కనిపిస్తోంది. కవితను బీఆర్ఎస్ టార్గెట్ చేసేలా జాగృతి టీం ప్రయత్నించి అదును చూసి.. ఎదురుదాడికి దిగుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ టీం స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వార్ పరాకాష్టకు చేరింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు కవితను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటే, ప్రతిస్పందనగా జాగృతి సోషల్ మీడియా బృందాలు కూడా బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రచారం చేస్తున్నాయి.
కవితను వ్యక్తిగతంగా దూషించడం, ఆమె కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటివి ఆమెపట్ల సానుభూతిని పెంచుతున్నాయి. ఆడబిడ్డపై ఇంతలా దాడి చేయాలా అన్న భావన తెలంగాణ సమాజంలో మొదలైంది. ఫలితంగా, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు పార్టీకి క్షేత్రస్థాయిలో మేలు చేయడం కంటే నష్టమే ఎక్కువగా చేకూరుస్తున్నాయి.
మరోవైపు, కవిత నేతృత్వంలోని జాగృతి సోషల్ మీడియా టీం ఇప్పుడు వెనక్కి తగ్గడం లేదు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని లోపాలను కవిత శాసన మండలి సాక్షిగా బయటపెట్టిన తీరును జాగృతి టీమ్స్ ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పేరు మార్పు మొదలుకుని, తెలంగాణ అస్తిత్వాన్ని పక్కన పెట్టడం వరకు ప్రతి అంశంలోనూ గులాబీ పార్టీని ఇరుకున పెట్టేలా పోస్టులు పెడుతున్నారు. ఇది కేడర్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది.














Comments are closed