మాస్ మహారాజా రవితేజ మొదటిసారి తన మాస్ ఇమేజ్ పక్కనపెట్టి పూర్తి వినోదానికి ప్రాధాన్యమిచ్చి చేసిన సినిమా ‘ భర్త మహాశయులకు విజ్ఞప్తి ’ సినిమా సంక్రాంతి బరిలో విడుదలైంది ‘రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై మొదట్నుంచి మిక్స్ డ్ అంచనాలున్నాయి.
కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. నిర్మాతగా సుధాకర్ చెరుకూరి వ్యవహరించగా, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌కు వచ్చిన స్పందన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా “రవితేజ ఈజ్ బ్యాక్” అన్న మాట అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
“#BMW ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ – పూర్తిగా యావరేజ్. కథలో బలమైన సెటప్ పెద్దగా లేదు, స్టోరీ పలుచగానే ఉంది. కానీ కామెడీ మాత్రం చాలా చోట్ల వర్క్ అయింది. మధ్యలో కొన్ని డిప్స్ ఉన్నా, ఓవర్ ది టాప్ సన్నివేశాలు ఉన్నా, ఈ జానర్‌కు సరిపోయేలా ఉంది. ఇటీవల కాలంలో రవితేజ సినిమాల్లో ఇది బెటర్ ఫస్ట్ హాఫ్” అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
“అబ్బా… ఆ టైమింగ్, ఆ ఎనర్జీ! #RaviTeja పూర్తిగా ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. #BMWలో కామెడీ ‘నెక్స్ట్ లెవెల్’. మిగతా సినిమాల గురించి పక్కన పెట్టి, ఈ ఫుల్-ఆన్ ఎంటర్‌టైనర్‌ను మిస్ అవ్వకండి. ఇది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్. సంక్రాంతి విన్నర్ ఇదే” అంటూ కొంతమంది రవితేజ అభిమానులు రాసుకొచ్చారు.








Comments are closed