At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.
పిల్లల బాధ్యతలతో పాటు వ్యక్తిగత జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ, రేణు దేశాయ్ మళ్లీ ఇండస్ట్రీలోకి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ క్రమంలో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా మారారు. అలాగే సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటూ, తన వ్యక్తిగత జీవితం, పిల్లలతో గడిపే క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాంటి రేణు దేశాయ్ సడెన్ గా మీడియా ముందుకు వచ్చి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
వీధి కుక్కల సంరక్షణ గురించి రేణు తాజా ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కుక్కల వల్ల మనుషులు చనిపోతున్నారని వాదించేవారు, రోజూ రోడ్డు ప్రమాదాలల్లో చనిపోతున్న లక్షలాది కుక్కల ప్రాణాల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కేవలం కుక్కలపై ఉన్న కోపంతో మనుషుల ప్రాణాల గురించి సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు. హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు లేని మానవత్వం, వీధి కుక్కల విషయంలోనే ఎందుకు బయటకు వస్తోందని ఆమె నిలదీశారు. తాను మూగజీవుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
రేణు దేశాయ్ ఒక జంతు ప్రేమికురాలు అనే సంగతి తెలిసిందే. రోడ్లపై వీధి కుక్కలు తిరగడానికి వెళ్లేదని, స్ట్రీట్ డాగ్స్ ను షెల్టర్లకు తరలించాలంటూ గత సెప్టెంబరులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వీధి కుక్కల సంరక్షణ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతూ వస్తున్నారు. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా వీధి కుక్కలకు ఆహారం, ఆశ్రయం కల్పించడం, వైద్య సహాయం అందించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. వీధి కుక్కలను చంపడంపై రేణు దేశాయ్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఇటీవల కొన్ని ఏరియాలలో వీధి కుక్కలను చంపినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ట్రీట్ డాగ్స్ కారణంగా మనుషులు చచ్చిపోతున్నారని మాట్లాడేవారు.. యాక్సిడెంట్స్ వల్ల నిత్యం లక్షలాది మంది చనిపోతున్నారని, దానిపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ”కుక్కల వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయని సెప్టెంబర్ లో సుప్ కోర్టు వ్యాఖ్యానించింది. కుక్కలు కరవడం వల్ల చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, రేబిస్ వ్యాధి వస్తోందని, రోడ్లపై బైకులపై ప్రయాణిస్తున్న వారిని వెంబడించడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయని అంటున్నారు. మనుషుల ప్రాణాల గురించి మాట్లాడేవారు.. మీకు నిజంగా మనుషుల మీద కరుణ, దయ ఉంటే.. రోజూ యాక్సిడెంట్స్ వల్ల లక్షలాదిమంది చనిపోతున్నారు. మరి ఆ సుప్రాణాలకు విలువ లేదా?. దోమకాటు వల్ల ఏడాదికి ఎంతోమంది చచ్చిపోతున్నారు. అని రేణు దేశాయ్ ప్రశ్నించారు.
సుప్రీం తీర్పుపై రేణుదేశాయ్ ఫైర్..!

Related Tags: