తెలంగాణలో ఆడపిల్లల కుటుంబాలకు ఆర్థిక ఊరట కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించే కల్యాణ లక్ష్మి పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల హామీల అమలులో భాగంగా కల్యాణ లక్ష్మి పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా పెళ్లి ఖర్చుల భారం తగ్గించడంతో పాటు, ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. పథకం కింద రూ.1,00,000 నగదు తో పాటు 10 గ్రాముల బంగారం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. ఇప్పటివరకు 65,026 మంది అర్హులు దరఖాస్తు చేసుకోగా, మరో 31,468 దరఖాస్తులు పరిశీలన దశలో పెండింగ్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కల్యాణ లక్ష్మి పథకం అమలుకు ప్రభుత్వం 2026 బడ్జెట్లో రూ.2,175 కోట్లు కేటాయించింది. అర్హతలు పూర్తైన లబ్ధిదారుల ఖాతాల్లోకి త్వరలోనే నేరుగా నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పేద కుటుంబాలకు ఊరట లభించనుందని, ఆడపిల్లల సంక్షేమంలో ఇది కీలక ముందడుగు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు














Comments are closed