Hyderabad
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకుప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేయనుంది.
కేసీఆర్ ప్రస్తుతం ఉన్న ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు సిట్ అధికారులు బయలు దేరినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొననున్నట్టు తెలుస్తోంది. ఈనోటీసులు కేసీఆర్‌కు అందించిన అనంతరం ఆయనను విచారించేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు, పార్టీ నేత సంతోష్ కుమార్‌లు సిట్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయనున్న పరిణామంతో ఈవ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కేసు నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. సిట్ విచారణలో రానున్న అంశాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.














Comments are closed