Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • desk
  • KCRపై సిట్ విచారణ.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పిలుపు

KCRపై సిట్ విచారణ.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పిలుపు

కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు శాంతియుత ఆందోళనలు చేపట్టనున్నాయి. ఈ మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

రేపు రాష్ట్రంలోని 12 వేలకుపైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించనున్నారు. అలాగే ప్రతి మున్సిపల్‌, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నారు.

ఈ ఆందోళనల్లో మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే.. ఈ నిరసనలు శాంతియుతంగా నిర్వహించాలని, పోలీసులతో ఎలాంటి ఘర్షణలకు దిగవద్దని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.

Comments are closed

Related Posts