Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • desk
  • మహబూబాబాద్ లో మైండ్ గేమ్ పాలిటిక్స్..

మహబూబాబాద్ లో మైండ్ గేమ్ పాలిటిక్స్..

మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికలు రోజురోజుకూ రాజకీయంగా మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో స్పష్టత లేక డోలాతనంలో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎర్ర పార్టీల పొత్తులు పొడిచిన వేళ, అసలు బలి అయ్యింది ఎర్ర పార్టీల నేతలు కాకుండా కాంగ్రెస్ స్వంత పార్టీ ఆశావాహులేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దాదాపు 80 శాతం అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియలో పొత్తుల లెక్కలు, రాజకీయ సమీకరణల పేరుతో పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు, పాత కార్యకర్తలను టికెట్ల నుంచి తప్పించబడినట్లు సమాచారం. ఈ పరిణామాల వల్ల మొదట ఒత్తిడిలో ఉన్న బీఆర్ఎస్‌కు కొంతవరకు రాజకీయ ఊరట లభించినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఏర్పడిన అంతర్గత అసంతృప్తి, రెబల్ అభ్యర్థుల అవకాశం, ఓట్ల విభజన వంటి అంశాలు చివరికి బీఆర్ఎస్‌కు వ్యూహాత్మక లాభంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రస్తుతం రాజకీయ దిశను నిర్ణయించేది ఒక్క అంశమేనని పరిశీలకులు అంటున్నారు. అది చైర్మన్ అభ్యర్థి ప్రకటన. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తే పార్టీ క్యాడర్‌లో స్పష్టత వస్తుంది, రెబల్స్‌ను అడ్డుకునే అవకాశం ఉంటుంది, ఎన్నికల పోరుకు దిశ లభిస్తుంది.

ఎర్ర పార్టీల మధ్య పొత్తులు కొనసాగకపోవడంతో వారు పోటీ లేని వార్డుల్లో వారి ఓటు బ్యాంక్ ఎటు మళ్లుతుందన్న ప్రశ్న కూడా కీలకంగా మారింది. ఈ ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్తాయా, బీఆర్ఎస్ వైపు మళ్లుతాయా, లేక ఇండిపెండెంట్లకు దక్కుతాయా అన్నది ఫలితాలను ప్రభావితం చేసే అంశంగా మారనుంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్‌లో స్పష్టత లేకపోవడం బీఆర్ఎస్‌కు మరో రాజకీయ అవకాశంగా మారుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం పరిణామాల మధ్య రాజకీయ వర్గాల్లో ఒక కఠినమైన ప్రశ్న వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ముఖ్యం కాదా? లేక వ్యక్తిగత లెక్కలే అభ్యర్థుల ఎంపికను నడిపిస్తున్నాయా? అనే సందేహం వ్యక్తమవుతోంది.

మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక పాలన కోసం జరిగే ఎన్నికలు మాత్రమే కాకుండా, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పునాదిగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో తీసుకునే నిర్ణయాల ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై పడనుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
మొత్తంగా మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ దృశ్యంలో

Comments are closed

Related Posts