Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Movie
  • Crime
  • అత్తపై అల్లుడు హత్యాచారం.. హత్య..!

అత్తపై అల్లుడు హత్యాచారం.. హత్య..!

కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెకు కొన్నేళ్ల క్రితం తిమ్మాజీపేట మండలానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిపించింది. అయితే అల్లుడు మద్యానికి బానిసై తరచూ కుమార్తెను వేధింపులకు గురిచేస్తుండటంతో.. అతడిని అత్త ఇంటికి ఇల్లరికంగా తెచ్చుకుంది.

ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అల్లుడు అత్తపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం తీవ్రంగా కొట్టి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరుగుపొరుగువారు విషయం గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి రెండో కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments are closed

Related Posts