మే 4న ప్రవేశ పరీక్షలు.. 18న తుది ర్యాంకుల వెల్లడి.
రాష్ట్రంలో లాసెట్, ఎడ్సెట్ -2026 ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. లాసెట్ కు మార్చి 12వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అనంతరం రూ.వెయ్యి అపరాధ రుసుముతో 16 వరకు, రూ.2వేలతో 20వరకు, రూ.4వేలతో 24వరకు, రూ.10వేలతో మార్చి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. మార్చి 30న దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తోంది.ఏప్రిల్ 20న హాల్ టికెట్లు విడుదల చేసి మే 4న ప్రవేశ పరీక్ష, 18న తుది ఫలితాలను ప్రకటించనుంది.
ఎడ్సెట్ కు మార్చి 9వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు ఇచ్చింది. అనంతరం రూ.వెయ్యి అపరాధ రుసుముతో మార్చి 13వరకు, రూ.2వేలతో 17వరకు, రూ.4వేలతో 21వరకు, రూ.10వేలతో 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. మార్చి 26న దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించగా ఏప్రిల్ 20న హాల్టికెట్లు అందుబాటులో ఉంచనుంది. మే 4న ఆన్లైన్లో మధ్యాహ్నం 2 నుంచి 4గంటల వరకు ఎడ్సెట్ పరీక్ష నిర్వహించి 18న తుది ర్యాంకులు ప్రకటించనుంది.















Comments are closed