Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం..

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం..

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ హయాంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం వ్యవహారంపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. APSBCL డిపోల నుండి ప్రభుత్వ లిక్కర్ షాపులకు మద్యం సరఫరా చేసే లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించారన్న ఆరోపణలతో సీఐడీ తాజాగా మరో కేసు నమోదు చేసింది.

విజిలెన్స్ విచారణతో ఈనెల 10వ తేదీనన కేసు నమోదు చేసిన సీఐడీ.. విచారణ బాధ్యతను సిట్ చీఫ్ గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబుకు అప్పగించింది. ఈ వ్యవహారంలో సుమారు రూ.200కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు అంచనా వేసింది. ఈ కొత్త కేసుతో మరిన్ని కొత్త అరెస్ట్ లు ఉంటాయా అన్నది వేచి చూడాలి.

Comments are closed

Related Posts