Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • శ్రీలక్ష్మికి మరోసారి ఎదురుదెబ్బ

శ్రీలక్ష్మికి మరోసారి ఎదురుదెబ్బ

ఓబుళాపురం అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె దాఖలు చేసిన రివిజనల్ పిటిషన్ పై శ్రీలక్ష్మికి భారీ ఎదురుదెబ్బ తగిలిగింది. డిశ్చార్జ్‌ పిటిషన్‌ కొట్టివేత తనను నిందితురాలిగా తొలగించాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌ను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ‘క్యాప్టివ్‌ మైనింగ్‌’ తొలగింపు.. శ్రీలక్ష్మి ఉద్దేశపూర్వకంగా ‘క్యాప్టివ్‌ మైనింగ్‌’ అనే పదాన్ని తొలగించడం ద్వారా అక్రమాలకు దారులు తెరిచారని సీబీఐ వాదించింది.

ఈ వ్యవహారంలో ఆమెది కీలక పాత్ర అని పేర్కొంది. అక్రమాస్తుల ఆరోపణ: శ్రీలక్ష్మి పదవిలో ఉన్న సమయంలో ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. స్టే పొరపాటుపై వివరణ: ఈ కేసును గతంలో వేరే కేసుగా భావించి తాము పొరపాటున స్టే (Stay) ఇచ్చామని, ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌ ధర్మాసనం పేర్కొంది. కోర్టు వ్యాఖ్యలు: పొరపాటుగా ఇచ్చిన స్టేను నిందితులు ఇన్నాళ్లూ ‘ఎంజాయ్‌’ చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణకు ఆదేశం: కేసు విచారణను ట్రయల్‌ కోర్టులో (కింది కోర్టులో) కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Comments are closed

Related Posts