హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన 43 ఏళ్ల శైలజ మృతదేహాన్ని ‘ఏసుప్రభు మళ్లీ బతికిస్తాడ’నే నమ్మకంతో కుటుంబ సభ్యులు నాలుగు రోజుల పాటు ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు చేయడం స్థానికంగా కలకలం రేపింది.
శైలజ అనారోగ్య కారణాలతో మరణించగా, ఆమె తల్లి శమంతకమణి, తోబుట్టువులు సునీత, జయరాం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె మళ్లీ ప్రాణం పోసుకుంటుందని విశ్వసిస్తూ నిరంతరం ప్రార్థనలు నిర్వహించారు. రోజులు గడిచేకొద్దీ మృతదేహం నుండి దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ నివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అంత్యక్రియలు నిర్వహించాలని సూచించినా కుటుంబ సభ్యులు వినకపోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యుల స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని కైకలూరుకు తరలించారు.












Comments are closed